లబ్బు డబ్బు ......లబ్బు డబ్బు ......లబ్బు డబ్బు....గుండెలు రైళ్ళతో పోటీ.....ఏ సి గదుల్లోనూ ముచ్చెమటలు.....
నరాలు పగిలే ఉత్కంట .....నగరాల్లో అప్రకటిత curfew ..... టెన్షన్ టెన్షన్ ......చిన్నా పెద్దా .....అందరిలో ఒకటే టెన్షన్....ఎవరూ కదలడం లేదు....కళ్ళు ఆర్పడము లేదు .....ఏమవుతుందో ఏమో.......
ఇంతలో " అసలేమయిన్దర్రా ......ఏరీ.... ఎవరూలేరా......"
అప్పుడే నిద్రలేచి కూర్చుంటున్న బామ్మ, కళ్ళు నులుముకుంటూ..... ఇల్లంతా పరికించి చూస్తూ అంది. కానీ ఎవరూ పలకలేదు.
" అమ్మో అమ్మో తలుపులు కూడా వేయకుండా ఎటోపోయారు వెదవలు.....నేను చూసాను కాబట్టి సరిపోయింది " తిట్టుకుంటూ... ఆ గోడా ఈ గోడా పట్టుకుని ముందుకు వెళ్ళుతోంది బామ్మ.
ఉత్కంతబరితంగా సాగుతోంది ఇండియా - పాకిస్తాన్ వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్...
సరిగ్గా అప్పుడే హర్భజన్ వేసిన ఫుల్ టాస్ బంతిని అఫ్రిది కళ్ళు గట్టిగా మూసుకుని కొట్టాడు....అది కాస్తా extra కవర్ లోని సెహ్వాగ్ చేతులలో పడింది.....
అంతే ఇంకేముంది ఆ పక్కగదిలో ఉన్న పదిమందీ... బిగ్గరగా పెంకులూడేలా "అవుట్ " అని అరిచారు ఒక్కసారిగా దబ్బ్ అని పెద్ద శబ్దం బయటనుండి.....కానీ ఎవరికీ వినపడలేదు.
చప్పట్లు , కేరింతలతో ఆ ఇంట్లో ఒక్క సారిగా పండుగ వాతావరణం చోటు చేసుకుంది. అప్పుడే బయటనుండి హడావుడిగా వస్తున్న బుజ్జిగాడు ఎందుకో ఆగాడు...." బామ్మా .....బామ్మా ......బా మ్మా " అరిచాడు.....కానీ బామ్మ కదల్లేదు.
"బామ్మ పడిపోయిందీ " గావుకేక పెట్టాడు.......అయినా ఎవరికీ వినపడలేదు...in fact వినిపించుకోవడం లేదు.
కళ్ళు ఆర్పడం లేదు .....కదలడం లేదు.strike లో మిస్బా......బంతి వేయబోతున్న నెహ్రా....మళ్ళా టెన్షన్....ఏమి జరుగుతుందో....ఫైనల్ కి చేరేనా....ఈ వహాబ్ రియాజ్ గాడు కొట్టేస్తాడా ......లబ్బు డబ్బు లబ్బు డబ్బు .....
"నాన్న బామ్మా నేల మీద పడిపోయింది" .....
"చల్లగా ఉందని పడుకుని ఉండి ఉంటుంది లేరా....పో పడుకో పో" TV వైపు చూస్తూ కసిరాడు బుజ్జిగాడి నాన్న.....
" బామ్మా పడిపోయింది అమ్మా"......." పీడా విరగడయ్యింది(మనసులో) ....మ్యాచ్ అయ్యాక నేను వెళ్లి లేపుతాలే బుజ్జి ..నువ్వు పోయిపడుకో " బరోసా ఇచ్చింది బుజ్జిగాడి తల్లి.
" పెదనాన్న బామ్మ క్రింద పడిపోయిందీ "........" నా చిన్నప్పటి నుండి మీ బామ్మ అంతేరా బుజ్జా ....ఏడ పడితే ఆడ పడుకున్దిద్ది..... ఇంద ఇయ్యి తినుకుంటా పో " చేతిలో నాలుగు చిప్స్ పెట్టి పంపాడు పెదనాన్న.
ఇంటిల్ల పాది స్పృహతప్పి టీవీలో పడున్నారు....ఎవ్వరు పలకడంలేదు.ఇలా లాభం లేదని తేలిపోయింది బుజ్జిగాడికి.
వెంటనే పక్కింటి వరండాలో ఎప్పుడూ చాలా మంది ముసలి వాళ్ళు టోకెన్లు తీసుకుని కూర్చోవడం గుర్తుకు వచ్చింది...
" ఆ.... పక్కింట్లోనే డాక్టర్ గారు ...అప్పుడప్పుడు నాన్న ....పెదనాన్న కూడా వెళ్లి మందులు తెచ్చుకుంటారు....YES గుర్తుకొచ్చిందీ" అంతే... హీరొయిన్ ని రక్షించటానికి పరిగెత్తే మహేష్ బాబు లా పరిగెత్తాడు పక్కింటికి మన బుజ్జిగాడు.
డాక్టర్.పోరాటం....పెద్ద ఎర్ర రంగు అక్షరాలతో ఇంటి బయట బోర్డు."ఎవరబ్బాయివిరా నువ్వు ? " సాగిపోయిన బనీను....నిలువు చారల చెడ్డీ దానికో బొందు....సన్నగా పొడుగ్గా బక్కచిక్కిపోయి....నె రిసిన హిట్లర్ మీసాలు....చేతిలో టామీ గాడికి కట్టిన గొలుసు....దానికి వ్రేల్లాడుతూ టామిగాడు ......మరో చేతిలో సిగరెట్టు....అప్పుడే భోజనం చేసి బయటకు వస్తున్నట్టున్నాడు....బుజ్జిగా డు గేటు కొట్టే లోపే గేటు తీసి మరీ అడిగాడు Dr పోరాటం.
"అదిగో ఆ పసుపచ్చ డాభా ...నల్ల గేటు....నీలం రంగు తలుపు...ఆ ఇంట్లో ఉంటామండి ....నా పేరు బుజ్జి....నాకు డాక్టర్ గారు కావాలి " ఆత్రుతగా అడిగాడు బుజ్జి.
" ఏ.... ఆ డాక్టర్ ని నేనే.....ఎందుకూ.... నువ్వు కొట్టిన బంతి గాని మా ఇంట్లో పడిందేటి" గీరగా అడిగాడు డా. పోరాటం.
" కాదండీ మా బామ్మ పడింది"....
" ఏంటి మా ఇంట్లోనా...? "
" కాదండి మా ఇంట్లో "
" అయితే దానికి నేనేం చెయ్యాలి "
" మీరు డాక్టర్ కదా వచ్చి చూడాలి "
" ఓహో అదా....కాకాపొతే నేను బామ్మలు పడిపోతే చూసే డాక్టర్నికాదురా బుజ్జీ....."
" ఒక్కసారి వచ్చి చూడండీ .... PLEASE ....మీకు తెలుస్తుంది " బ్రతిమాలాడాడు బుజ్జిగాడు.
" అస్సలు లాభం లేదురా బుజ్జా ......నేనెలాంటి డాక్టర్నోనీకు చెప్పినా అర్ధం కాదు " సిగరెట్టు పారేస్తూ అన్నాడు డాక్టర్.
" అదంతా నాకు తెలీదు " ...టామీ గాడిని గొలుసు తో సహా లాక్కుంటూ అన్నాడు బుజ్జిగాడు.....
" అయితే వచ్చి మీరు మా బామ్మ ని చూడండి...లేక పోతే మీ టామీ ని మీరు మళ్లీ చూడరు " దెబ్బకి అదిరాడు డాక్టర్.
" ఓ సూపర్ రా బుజ్జి గా.... ఈ బక్కెదవ నన్ను ఏనాడు ఈ గోడ దాటి ముందుకు తీసుకెళ్లడు.....జీవితంలో ఒంటరిగా ఎన్ని కోల్పోతునాన్నో ఈ బక్కోడి ఇంట్లోపడి.....ఆహా వీదీ వీదికీ ఎన్నెన్ని వాసనలు.... ఊరూరా మరెన్నికుక్కలో .....నన్నెటుకు పోరా బుజ్జిగా ఆగలేకపోతున్నాను.....ఆడు మీ బామ్మాని చచ్చినట్టు చూస్తాడూ.....నేనులేకపోతే ఈడికి ఈ ఇంట్లో ఎంట్రీ లేదె హే .....సంపేస్తది ఈడిని ఈళ్ళావిడి " ఒక్క సారిగా ప్రాణం లేచొచ్చింది టామీ గాడికి.
ఇంకో వికెట్ పడినట్టుంది....గొల్లున గోల ఒక్క సారిగా...
ఇంతలో టక్కున మాయమయిపోయాడు బుజ్జిగాడు టామీ గాడిని తీసుకుని....చేసేది లేక నల్ల గేటు తీసి ....నీలం రంగు తలుపు తోసుకొని పసుప్పచ్చ డాబా లోనికెళ్ళాడు డాక్టర్ పోరాటం.
కూలిన జపాన్ భవనం లా పడుంది బామ్మ హాల్ మద్యలో.
పెద్ద ఇల్లు.... అంతా నిశబ్దం.....ఇంట్లో ఎవరూ కనపడలేదు...బామ్మాని ఎలా లేపాలో ఆలోచిస్తూ .....అటు ఇటు తిరుగుతున్నాడు డాక్టర్.
ఇంతలో మరో వికెట్ పడింది...ఉమర్ గుల్.....ఒక్క సారిగా " అవుట్ "..... ఇల్లదిరేలా అరిచారంతా.
జడుసుకు చచ్చాడు డాక్టర్ ....ఆ అరుపుకి కాస్తకదిలింది బామ్మ....కానీ అది గమనించలేదు డాక్టర్. కాసేపటికి పూర్తిగా మేలుకోంది....ఇంతలో తెలిసిన డాక్టర్ కి ఫోన్ చేద్దామని ఫోన్ కోసం వెతుకుతూ లోపలి కి వెళ్ళుతున్నాడు డాక్టర్.
" అమ్మ దొంగ వెదవ....తలుపులు తీసి ఉండటంతో లోపలికి జోరబడ్డావన్నమాట " డాక్టర్ వెనకాలే గోడలు పట్టుకు నడుస్తోంది బామ్మ.
అటూ ఇటూ చూస్తూ నిదానంగా నడుస్తున్నాడు డాక్టర్. డాక్టర్ కి చేరువులోకి వచ్చేసింది బామ్మ.
సరిగ్గా అప్పుడే మిస్భా ....పాకిస్తాన్ ఆకరి వికెట్ అవుట్.
" ఇండియా విన్ " కేకలు , కేరింతలు , టపాసులు......ఒక్క సారిగా భూకంపం వచ్చినట్టయింది.
ఏమి జరిగిందని డాక్టర్ వెనక్కి తిరిగాడు....అంతే ఓ ముష్టి ఘాతం ....ముఖానికి దగ్గరగా చూసినట్టు గుర్తు....ఆ పిడి గుద్దు తరువాత ' నీలం రంగు తలుపు' .... ' నల్ల గేటు' దాటి ఆ పసుప్పచ్చ డాబా లోంచి బయటకి ఎలా వచ్చాడో కూడా గుర్తు లేదు డాక్టర్ కి.
ఎవరో ముఖాన నీళ్ళు చల్లి లేపారు.అసలేమి జరిగిందని అడిగారు....అప్పుడు గుర్తుతెచ్చుకుని మరీ చెప్పాడు వివరంగా.
"అది సరే గాని డాటరు గారు.... మీరే డాటరు కదా మరి ఇంకో డాటరు అవసరం ఎమోచ్చినాది మీకు ? "
"ఒరేయ్ ఒరేయ్....నేను సెక్స్ specialist ని రా బాబు ....బామ్మలు పడిపోతే నేనెలా లేపేది....ఇంకోటి ఏదైనా అంటే అనుకోవచ్చు? " మోత్తుకున్నాడు డాక్టర్. పోరాటం.
జైకిషన్.
*పాత్రలు ...సన్నివేశాలు ఎవరని ఉద్దేశించి రాసినవి కావని గమనిక.